నీవెంటే నేను నిబ్బరముగాను నడిచెదను కడవరకును నీ కాంతిలోనూ నిశ్చయతతోను song lyrics | gospelsongswithlyrics.blogspot.com |

పల్లవి:-
నీవెంటే నేను నిబ్బరముగాను 
నడిచెదను కడవరకును (2)
నీ కాంతిలోనూ  నిశ్చయతతోను (2)
సాగెదను నీ త్రోవను యేసయ్యా…(2)
(నీవెంటే నేను)
చరణం:-1
పెనుగాలులందు  తలదించకుందు
నీ మాట నే నమ్ముకొందు ….(2)
చలిరాత్రులందు చలియించకుందు 
శ్రమలైనను ఓర్చుకుందు (2)
ఏ చర అయినా ఏ కరువయినా
మరి ఏదైనా నేనుండి నన్ను ఎడబాపున….
(నీవెంటే నేను)
చరణం:-2
అడ్డంకులందు చింతించకుందు
నీ సాయమే  కోరుకుందు…(2)
ఇబ్బందులందు వెనుతిరగకుందు
వాగ్దానముల ఆనుకొందు….(2)
ఏ తెగులైన ఏ దిగులైనా 
మరి ఏదైనా నేనుండి నన్ను ఎడబాపున….
(నీవెంటే నేను)
చరణం:-3
కారడవులందు భయపడకయుందు
నీ నీడలో దాగుకొందు….(2)
ఉపద్రవములందు తడబడకయుందు
స్తుతి గీతమే పాడుకొందు….(2)
ఏ వ్యధ అయిన ఏ వృద అయ్యిన
మరి ఏదైనా నేనుండి నన్ను ఎడబాపున….
(నీవెంటే నేను)
x

Leave a comment

Design a site like this with WordPress.com
Get started