నీవెంటే నేను నిబ్బరముగాను నడిచెదను కడవరకును SONG LYRICS 4U | TELUGU CHRISTIAN SONG LYRICS 4U |

పల్లవి:-

నీవెంటే నేను నిబ్బరముగాను 

నడిచెదను కడవరకును (2)

నీ కాంతిలోనూ  నిశ్చయతతోను (2)

సాగెదను నీ త్రోవను యేసయ్యా…(2)

(నీవెంటే నేను)

చరణం:-1

పెనుగాలులందు  తలదించకుందు

నీ మాట నే నమ్ముకొందు ….(2)

చలిరాత్రులందు చలియించకుందు 

శ్రమలైనను ఓర్చుకుందు (2)

ఏ చర అయినా ఏ కరువయినా

మరి ఏదైనా నేనుండి నన్ను ఎడబాపున….

(నీవెంటే నేను)

చరణం:-2

అడ్డంకులందు చింతించకుందు

నీ సాయమే  కోరుకుందు…(2)

ఇబ్బందులందు వెనుతిరగకుందు

వాగ్దానముల ఆనుకొందు….(2)

ఏ తెగులైన ఏ దిగులైనా 

మరి ఏదైనా నేనుండి నన్ను ఎడబాపున….

(నీవెంటే నేను)

చరణం:-3

కారడవులందు భయపడకయుందు

నీ నీడలో దాగుకొందు….(2)

ఉపద్రవములందు తడబడకయుందు

స్తుతి గీతమే పాడుకొందు….(2)

ఏ వ్యధ అయిన ఏ వృద అయ్యిన

మరి ఏదైనా నేనుండి నన్ను ఎడబాపున….

(నీవెంటే నేను) 

Leave a comment

Design a site like this with WordPress.com
Get started