దివి నుండి భువికి రారాజుగా బెత్లహేము పురముకు ఏతెంచెను TELUGU CHRISTAMS SONG

 పల్లవి:-

దివి నుండి భువికి రారాజుగా

బెత్లహేము పురముకు 

ఏతెంచెను (2)

గ్రామమంతా చిరునవ్వు లొలికే

పట్టణమంతా పండుగ చేసి (2)

సర్వలోకము సంబరమాయే

ఆశ్చర్యకరుడు హల్లెలుయా

ఆలోచనకర్త హల్లెలూయ

బలమైన దేవుడు హల్లెలూయ

నిత్యుడగు తండ్రి హల్లెలూయ

సమాధానకర్త హల్లెలూయ

చరణం:-+01

గొల్లలు జ్ఞానులు పరవశులై

బంగారం సాంబ్రాణి 

బోళమును (2)

సాష్టాంగపడి తమ హృదయములన్

ప్రభువుకు కానుకలర్పించిరి (2)

మనము కూడా అర్పించెదమ్

ప్రభువు నామము ఘనపరిచెదం

మనము కూడా సాష్టాంగపడుచు

పరవశించుచు  పాడెదము 

(ఆశ్చర్యకరుడు)

చరణం:-+02

పాపము శాపము బాపగను

వేదన శోధన తీర్చగను (2)

పరిశుద్ధుడు జన్మించెనని

ఇహమున పరమున కొనియాడెదన్

మనము కూడా కొనియాడెదం

ప్రభువు నామము ఘనపరిచెదం

మనము కూడా హాసన్నయనుచు

కరములెత్తి పాడుదము 

(ఆశ్చర్యకరుడు)

TAGS 

Telugu Christams song lyrics 

Leave a comment

Design a site like this with WordPress.com
Get started