కల్వరి స్వరము నీ కొరకే  సుమధుర స్వరము  Song Lyrics | Satish Kumar Song Lyrics 🎵

 Good Friday song

పల్లవి:-

కల్వరి స్వరము నీ కొరకే 

సుమధుర స్వరము 

మన కొరకే (2)

మరి ఆలకించుమా ప్రభు స్వరము 

ప్రియ స్వరము

సా…సగరిగ….సానీ…

పా….మా గమపా…(2)

చరణం:-+01

సత్యము తెలియని 

గమ్యము దొరకని 

వారికేగా కల్వరి స్వరము

శాంతి లేకటు బ్రతుకలేకిటు 

అల్లాడుచున్న వారికి స్వరము

ఆశల అలలో నిరాశల వలలో (2)

చిక్కిన వారికి కల్వరి స్వరము 

చిక్కిన వారికి ప్రభునీ స్వరము 

(సా…సగరిగ)

చరణం:-+02

గాలి తుఫానులో 

చెదరిన వారిని 

దరికి చేర్చును కల్వరి స్వరము

చితికిన బ్రతుకును 

పగిలిన గుండెను

ఆదరించును ప్రియుని స్వరము

దాహముగొనినా వరలకెల్లా (2)

సేదదీర్చును కల్వరి స్వరము 

సేదదీర్చును ప్రభునీ స్వరము

(సా…సగరిగ)

చరణం:-+03

మార్పును కోరక 

తీర్పును తలచక 

తిరుగువారికి కల్వరి స్వరము

పైకి భక్తితో లోపల రక్తితో 

బ్రతుకు వారికి కల్వరి స్వరము

వేడిగ లేక చల్లగ లేక (2)

నులివెచ్చగుండే వారికి స్వరము 

నులివెచ్చగుండే వారికి స్వరము

(కల్వరి స్వరము)

Leave a comment

Design a site like this with WordPress.com
Get started