🎵. *ప్రేమించే యేసయ్య*
ఎవరున్నారయా ప్రేమించేవారు….
*నను క్షమియించి ఆదరించేవారు….* (2)
*యేసయ్యా నా యేసయ్యా*
*యేసయ్యా ఆకాశమందు నీవు తప్ప* *ఎవరున్నారయా ప్రేమించేవారు….*
*నను క్షమియించి ఆదరించేవారు….*
1️⃣
ఎంతోమంది ఉన్నానన్నారూ……
ఎన్నో విధముల ఆదుకుంటనన్నారూ..(2)
నమ్మించారు మురిపించారు
శ్రమకలిగినపుడు నన్ను విడిచి పోయారూ(2)
*యేసయ్యా నా యేసయ్యా*
*యేసయ్యా ఆకాశమందు నీవు తప్ప*
*ఎవరున్నారయా ప్రేమించేవారు….*
*నను క్షమియించి ఆదరించేవారు….*
2️⃣
ఎంతోఘోరంగా పాపాలు చేశానూ
ఎన్నో విధముల అవమానమొందానూ..(2)
భ్రమపడ్డాను కృంగిపోయాను
దిక్కువేరేలేక నీ పాదముల చేరాను(2)
*యేసయ్యా నా యేసయ్యా…*
*యేసయ్యా ఆకాశమందు నీవు తప్ప*
*ఎవరున్నారయా ప్రేమించేవారూ….*
*నను క్షమియించి ఆదరించేవారూ….*
3️⃣
ఎంతోకష్టము నష్టముల పాలైననూ…
ఎన్నో విధముల శోధనలనెదుర్కోన్ననూ(2)
నిన్ను విశ్వసించి శరణు కోరుచున్నాను
అంతమువరకు నీకై బ్రతికే కృపనిమ్మయా(2)
*యేసయ్యా నా యేసయ్యా*
*యేసయ్యా ఆకాశమందు నీవు తప్ప*
*ఎవరున్నారయా ప్రేమించేవారూ….*
*నను క్షమియించి ఆదరించేవారూ….*
పాడిన వారు: *బ్రదర్ నిస్సీ జాన్ గారు*
సేకరణ: *శ్రీమతి జె. విమల కుమారి*
🎤🎷🎺🥁🎻🎸🎼🎺🎤