కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా
నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెదా SONG LYRICS 🎵
కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా
నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెదా (2)
నాపైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే
నా యేసయ్యా సాత్వీకుడా
నీకోసమే నా జీవితం ||కరుణా||
1. ఏ నాడు నను వీడని – నీ ప్రేమ సందేశము
నా హృదయసీమలోనే – సందడిని చేసెను (2)
అణువణువును బలపరిచే – నీ జీవపువాక్యమే
ప్రతిక్షణము దరిచేరి – నన్నే తాకెను (2)
ఆ వాక్యమే ఆరోగ్యమై జీవింపజేసి నన్నే నడిపించెను ||కరుణా||
2. ఈ వింత లోకంలో – నీ చెంత చేరితిని
ఎనలేని ప్రేమలోనే – ఆదరణ పొందితిని (2)
నీ కృపలో నిలిపినది – నీ ప్రేమ సంబందమే
అనుదినము మకరందమే – నీ స్నేహబంధము (2)
ఆ ప్రేమలోనే కడవరకు నన్ను నడిపించుమా – స్థిరపరచుమా ||కరుణా||
3. నే వేచియున్నాను – నీ మహిమ ప్రత్యక్షతకై
నాకున్నా ఈ నిరీక్షణనే – సన్నిధిలో నిలిపినది (2)
నా కోసం నిర్మించే – సౌందర్యనగరములో
ప్రణమిల్లి చేసెదను – నీ పాదాభివందనం (2)
తేజోమయా నీ శోభితం – నే పొందెద కొనియాడెద ||కరుణా|