ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు SONG LYRICS 🎵 || HOSSANA MINISTRIES NEW YEAR SONG || TELUGU CHRISTIAN SONG LYRICS 🎵
ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు SONG LYRICS
పల్లవి:- ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు
మనస్సే మందిరమాయె – నా మదిలో దీపము నీవే
నిన్నాశ్రయించిన వారిని – ఉదయించు సూర్యునివలెనే
నిరంతరం నీ మాటతో ప్రకాశింపచేయుదువు
1.అమరమైన నీ చరితం – విమలమైన నీ రుధిరం
ఆత్మీయముగా ఉత్తేజపరచిన – పరివర్తన క్షేత్రము
ఇన్నాళ్ళుగ నను స్నేహించి – ఇంతగ ఫలింపజేసితివి
ఈ సర్వసంపదనంతటితో – అభినయించి నే పాడెదను
ఉండలేను – బ్రతుకలేను – నీతోడు లేకుండా – నీ నీడలేకుండా
ప్రేమే
2.కమ్మనైన నీ ఉపదేశము – విజయమిచ్చె శోధనలో
ఖడ్గముకంటే బలమైన నీ వాక్యము – ధైర్యమిచ్చె నా శ్రమలో
కరువుసీమలో సిరులోలికించెను – నీ వాక్యప్రవాహాము
గగనము చీల్చి మోపైన – దీవెన వర్షము కురిపించితివి
ఘనమైన నీ కార్యములు – వివరింప నా తరమా – వర్ణింప నా తరమా
ప్రేమే
3.విధిరాసిన విషాదగీతం – సమసిపోయె నీ దయతో
సంబరమైన వాగ్దానములతో – నాట్యముగా మార్చితివి
మమతల వంతెన దాటించి – మహిమలో స్థానమునిచ్చితివి
నీ రాజ్యములో జేష్ఠులతో – యుగాయుగములు నే ప్రకాశించనా
నా పైన ఎందుకింత గాఢమైన ప్రేమ నీకు మరువలేను