Which was Beautifully Lyric & Tune by Ps.Jyothi Raju . Watch and be blessed!
“YESU RAKSHAKA PRAANA SNEHITA | Ps.Jyothi Raju | Telugu Christian Song | Live Worship |” Song Info
ఏసు రక్షక – ప్రాణ స్నేహిత //2//
నిన్ను విడిచి క్షణమైనా – బ్రతుకలేనయ్యా
నీ మాట లేక నిమిషం – జీవించలేనయ్య //2//
నా జీవము నీవే – నా ప్రాణము నీవే
నా సర్వము నీవే – యేసయ్యా //2//
చరణాలు:- ((ఏసు))
1) కన్నతల్లి చంటి బిడ్డను మరచిన మరచున్
నేను నిన్ను మరువనంటివే //2//
తండ్రి ప్రేమ దూరమైన దూరమవును
అనాధలుగా విడువనంటివే //2//
నా తల్లియు నీవే – నా తండ్రియు నీవే
నా సర్వము – నీవే యేసయ్యా //2//
2) శత్రువులు వెంటపడి తరుముకొచ్చినా
భయపడకు జడియకంటివే //2//
కృంగదీసే శ్రమలు నన్ను చుట్టు కొచ్చిన
కృప నిన్ను విడువదంటివే //2//
నా జ్ఞానము నీవే నా ధైర్యము నీవే
నా సర్వము నీవే యేసయ్యా //2//
3) వ్యాధులు నా వంటినిండా బాధించగా
స్వస్థపరచు వాడనంటివే //2//
ఐశ్వర్యం ఇంటి నుండి దూరంమవగా
నావన్నీ నీవంటివే //2//
నా బలము నీవే నా ధనము నీవే
నా సర్వము నీవే యేసయ్య //2//
(( ఏసు))