1. హృదిని మార్చుదేవా – యధార్ధమైనదిగా . హృదిని మార్పుదేవా నీలో ఉందునట్లు నీవు కుమ్మరివి నేను మంటిని మలచి రూపించుమని – నా ప్రార్ధనా ||2||||హృదిని||
2 పాట పాడెదం ప్రభువునకు – పాట పాడెదం భూజనులారా పాట పాడెదం క్రొత్తపాట -పాట పాడెదం భూజనులారా గొప్ప దేవుడు – స్తోత్రారుడు ||2|
3. పిరికితనం దేవుడు మనకియ్యలేదు . శక్తియు ప్రేమయు మంచి మనసిచ్చేను
4. హోసన్నా హోసన్నా – హోసన్నా మహోన్నతుడు దేవ నీ నామము – ఉన్నత నామము కృతజ్ఞతా స్తుతులు నీకే – ప్రభావము రారాజుకే కీర్తి కీర్తి కీర్తి రారాజుకే – దేవ నీనామము ఘనమైన నామము – కృతజ్ఞతా స్తుతులు నీకే – ప్రభావము రారాజుకే
5. మహాదేవుని సేవించెదము – మహా దేవుని సేవించెదము భూమ్యాకాశములు దూతలు పూజింతురు – మహాదేవుని సేవించెదము
6. ఆయనే రాజుల రాజు – ఆయనే ప్రభువుల ప్రభువు ఆయన నామం యేసు (3)- ఓ… రాజుల రాజు
7.నీ కృప జీవము కంటె ఉత్తమము(2) నా పెదవులు నిన్ను స్తుతించును నీ కృప జీవం కంటే ఉత్తమం – నీ నామం బట్టి నా చేతులెత్తెదన్ (2) నా పెదవులు నిన్ను స్తుతించును – నీ కృప జీవము కంటె ఉత్తమము
8. యేసు ఉన్నత నామం – సుందర రక్షకా మహిమ స్వరూపా – ఇమ్మానుయేల్ మనకు తోడుగ – దీన విమోచక జీవవాక్యం
9. గొప్పదేవుడు మనకున్నాడు ||4|| – హల్లెలూయా హల్లెలూయా || గొప్పనామం యేసునామం || 4|| – గొప్పవాక్యం మనకున్నది ||4|| చప్పట్లు కొట్టి స్తుతించెదము ||4|| – గొప్ప విజయం మనకున్నది ||4|| హోసన్నా హోసన్నా ||4|| పరమ తండ్రి వందనాలు ||4|| యేసురాజా వందనాలు ||4||
10. నీతి సమాధానం ఆత్మలో ఆనందం అదే దేవుని రాజ్యం – ఆ రాజ్యములో నీ వుందువా రండి అందరు రండి. పరిశుద్ధాత్మ వందనాలు ||4||