దీనుడా అజేయుడా_ dhenuda ajeyuda song lyrics_ hosanna ministries new song 2021

 

దీనుడా అజేయుడా_ dhenuda
ajeyuda song lyrics_ hosanna ministries new song 2021

 

పల్లవి: దీనుడా అజేయుడా – ఆదరణ కిరణమా 
పూజ్యుడా పరిపూర్ణుడా – ఆనంద నిలయమా 
జీవదాతవు నీవని శృతిమించి పాడనా 
జీవధారవు నీవని కానుకనై పూజించనా 
అక్షయ దీపము నీవే – నా రక్షణ శృంగము నీవే 
స్వరార్చనచేసెద నీకే – నా స్తుతులర్పించెద నీకే
1: సమ్మతిలేని సుడిగుండాలే – ఆవరించగా 
గమనములేని పోరాటాలే- తరుముచుండగా
 నిరుపేదనైన నాయెడల – సందేహమేమి లేకుండా 
హేతువేలేని – ప్రేమచూపించి- సెలువచాటునే దాచావు సంతోషము నీవే – అమృత సంగీతము
నీవే 
స్తుతిమాలిక నీకే వజ్రసంకల్పము నీవే
                                                 ౹౹దీనుడా౹౹ 
2. సత్య ప్రమాణము నెరవేర్చుటకే – మార్గదర్శివై 
నిత్యనిబంధన నాతో చేసిన – సత్యవంతుడా 
విరిగి నలిగిన మనస్సుతో – హృదయార్చనే చేసేద 
కరుణనీడలో – కృపావాడలో – నీతోఉంటే చాలయ్యా 
కర్తవ్యము నీవే – కనుల పండుగ నీవేగా 
విశ్వాసము నీవే – విజయశిఖరము నీవేగా
                                                   ౹౹ దీనుడా ౹౹
3. ఊహకందని ఉన్నతమైనది – దివ్యనగరమే

 స్పటికము పోలిన సుందరమైనది – నీరాజ్యమే 
ఆ నగరమే లక్ష్యమై – మహిమాత్మతో నింపినావు 
అమరలోకాన – నీ సన్నిధిలో – క్రొత్త కీర్తనే పాడెదను ఉత్సాహము నీవే – నయనోత్సవం
నీవేగా 
ఉల్లాసము నీలో – ఊహలపల్లకి నీవేగా

Leave a comment

Design a site like this with WordPress.com
Get started