నీ కన్ను జాగ్రత్తగా కాపాడుకో SHORT MESSSAGE BY BLESSIE CREATIONS

ᴘʀᴀɪꜱᴇ ᴛʜᴇ ʟᴏʀᴅ

                               క్రీస్తు నందు నా ప్రియమైన సహోదరి,సహోదరులకు మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు..!దేవుడు మనకు తన వాక్యం ద్వారా చెప్పిన మాట ఏమిటి అంటే నీ కన్ను జాగ్రత్తగా కాపాడుకో అని అందుకే యోబు అంటున్నాడు నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను అంటున్నాడు ఎందుకంటె మనము పాపములో పడిపోవడానికి ప్రధాన కారణం కన్ను. ఈరోజు దేవుని వాక్యం చూస్తే ఒక స్త్రీని ఎప్పుడైతే మోహపు చూపుతో చూస్తామో అప్పుడే మన హృదయంలో ఆమెతో పాపం చేసినట్లు అని దేవుని వాక్యం చెప్తుంది. ఇది పురుషులకే కాదు స్త్రీలకు కూడా వర్తిస్తుంది ఏ పురుషుడుని అయితే చూసి తప్పుగా ఆలోచిస్తామో అప్పుడే పాపం చేసినట్టు అయితే ఈరోజు మన కళ్లు ఎలా ఉన్నాయి..? మన హృదయాలను మనము ఎలా కాపాడుకుంటున్నాం..? ఒక్కసారి మనలను మనమే పరీక్షించుకుందాం.. యోబు వలే మన కళ్లకు నిబంధన చేసుకుందాం.. దేవునికి విధేయత కలిగి జీవిద్దాం.. ఆ నిత్యనరకాగ్ని నుండి తప్పించబడదాం..అట్టి కృప దేవుడు మనందరికి దయచేయును గాక ఆమెన్.



Leave a comment

Design a site like this with WordPress.com
Get started