క్షమించి వారికొరకు ప్రార్ధించేటువంటి స్థితిని కలిగి ఉన్నామా..? SHORT MESSAGE BY BLESSIE

ᴘʀᴀɪꜱᴇ ᴛʜᴇ ʟᴏʀᴅ

  క్రీస్తు నందు నా ప్రియమైన సహోదరి,సహోదరులకు మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు..!ఈరోజుల్లో మనలను ప్రేమించేవారిని ప్రేమించడం, మనలను ప్రేమించే వారికొరకు ప్రార్ధించడం కూడా చేతకానివారివలే అనేకులు ఉంటున్నారు అయితే ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది తండ్రికి మనము కుమారులము, కుమార్తెలము అగునట్లు మన శత్రువులను ప్రేమించాలని, మనలను హింసించువారికొరకు ప్రార్ధించమని దేవుని వాక్యం చెప్తుంది అయితే నేటి దినాలలో క్రైస్తవులు అని పిలవబడుతున్న మన పరిస్థితి ఎలా ఉంది.? మనలను ఎవరైనా ఒక్క మాట అంటే తిరిగి నాలుగు మాటలు అంటున్నామా..? లేకపోతే వారిని క్షమించి వారికొరకు ప్రార్ధించేటువంటి స్థితిని కలిగి ఉన్నామా..?అందరినీ క్షమిద్దాం.. అందరిని నిమిత్తం ప్రార్థిద్దాం.. దేవుని రాజ్యాన్ని సంపాదించుకుందాం.. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయును గాక ఆమెన్..!



Leave a comment

Design a site like this with WordPress.com
Get started