సంబరమాయే మా ఊరంతా
ఆ రక్షకుని రాకతో
దేశమా 🇨🇮 ఆనందించుమా
నేస్తమా ఆరాధించుమా
పల్లవి:-
ఆదియందు ఉన్న దేవుడు
అద్వితీయ మహాదేవుడు
మానవాళి ముక్తి కొరకు రక్షకుడై
ఉదయించెను ఈ భువిపై (2)
చీకటి పోయెను మా ఇంట
నిండెను మా మది
సంతోషంతో (2)
క్రిస్మస్ సంబరమే మా ఊరంతా
ఆ రక్షకుని రాకతో
క్రిస్మస్ ఆనందమే మా ఇంట
ఆ రక్షకుని వెలుగుతో …(2)
దేశమా 🇨🇮 ఆనందించుమా
నేస్తమా ఆరాధించుమా …(2)
(ఆదియందు ఉన్న దేవుడు)
చరణం:-+01
చీకటి పాపము తొలగించి
వెలుగుతో మనలను నింపుటకై
పాప శాపము పరిహరించి
పరిశుద్దులుగా చేయుటకై (2)
సర్వోన్నతమైన ఆ
స్థలమును విడిచి
పశువుల పాకకు ఏతెంచెను (2)
ఎందరు అంగీకరించెదురో
అందరికీ దేవుని పిల్లలగుటకు
అధికారమిచ్చెను…(2)
దేవుని పిల్లలగుటకు
అధికారమిచ్చెను
(చీకటి పోయెను)
చరణం:-+02
మరణశ్చాయలు తొలగించి
జీవము మనలో నింపుటకై
అపరాధములన్ని తీసివేసి
నీతిమంతులుగా చేయుటకు(2)
తన ప్రజలను వారి పాపములనుండి
ఆయనే రక్షించును… ఓ…(2)
ఎందరు నమ్మి విశ్వసించెదరో
అందరికీ రక్షణ భాగ్యమిచ్చి
నిత్యజీవమిచ్చెను…(2)
రక్షణ భాగ్యమిచ్చి
నిత్యజీవమిచ్చెను
(చీకటి పోయెను)
x