అవనిలో ఉద్భవించే ఆదిసంభూతుని చూడరే పుడమియే పరవశించే పసిబాలుడు పుట్టగానే CHRISTMAS SONG | 2021 CHRISTIAN CHRISTMAS SONG |

అవనిలో ఉద్భవించే 
ఆదిసంభూతుని చూడరే
పుడమియే పరవశించే 
పసిబాలుడు పుట్టగానే 
పసిబాలుని చూడగానే
పల్లవి:-
ఆకాశమే పట్టనోడు
ధరణిలో పుట్టినాడు
దావీదు పురమునందు 
దీనుడై వెలిసినాడు రక్షకుడు (2)
ఆనందమే మహా ఆనందమే
అందరికీ ఇలలో సంతోషమే 
ఆశ్చర్యమే ఇది అద్భుతమే
యేసు జననం అద్భుతమే (2)
చరణం:-+01
అదృశ్య దేవుని 
మహిమా స్వరూపుడు
ఆది అంతమైన 
పరలోకనాథుడు (2)
ఆదియందు వాక్యంబుగా
సృష్టి కార్యము జరిగించినాడు
అనాది నుండి జ్ఞానంబుగా
సృష్టి క్రమము నడిపించినాడు (2)
అన్నిటినీ కలిగించిన మాహారాజు
కన్నిటినీ తుడుచుటకు దిగివచ్చినాడు (2)
(ఆనందమే మహా )
చరణం:-+02
పాపము లేని 
సుగుణాల సుందరుడు
శాపము బాపను 
జన్మించెను చూడు (2)
నిత్యముండు నీతి సూర్యుడు
సత్య సాక్షిగా ఇలకొచ్చినాడు
ప్రేమను పంచే పావనాత్ముడు
పశుల పాకలో పవలించినాడు (2)
సర్వాధికారియైన మహారాజు
దీనులకు దీవెనగా 
దిగి వచ్చినాడు (2)
(ఆనందమే మహా )
 

Leave a comment

Design a site like this with WordPress.com
Get started