దేవసుతుడు యేసు జన్మించె నిరతము స్తుతియింతుము దేవసుతుడు hebron christmas song Posted bysamuelrajsuraboinaNovember 13, 2021Posted inUncategorized పల్లవి:-🎶🎵🎸 దేవసుతుడు యేసు జన్మించె నిరతము స్తుతియింతుము (2) దేవసుతుడు చరణం:-+01 పాపుల రక్షించ పరమ నాథుడు శ్రమలను పొందెను ఆ …(2) నశియించిన వారిన్ వెదకి రక్షింప రక్షకుడై పుట్టెను (దేవసుతుడు) చరణం:-+02 బెత్లెహేములో నుత్తముడు జన్మించెను తండ్రి చిత్తము చేసెను ఆ …(2) భక్తులు పాదములకు మ్రొక్కిరి మనము స్తుతియింతుము (దేవసుతుడు) చరణం:-+03 ఘనుడు పుట్టెను పశుల పాకలో గొల్లలు పూజించిరి ఆ …(2) వేరే జనులు చోటీయకున్నను మనము స్తుతియించెదము (2) (దేవసుతుడు) చరణం:-+04 పుట్టినరాత్రి ప్రకాశమానం మృతిన్ పగటిలో ఆ …(2) స్తుతులకు తగిన శుద్ధుడు దూతల స్తుతులను బొందెన్ (దేవసుతుడు) చరణం:-+05 నరులు బొంకినను వేదము బొంకదు నరుల హృదయమేమో ఆ …(2) పుణ్యుని జన్మము మీ మదినున్న పూజింతురు వాని (దేవసుతుడు) చరణం:-+06 అనాది దేవుని చిత్తముచే – శ్రీ యేసు బయలుపడెను ఆ …(2) జలనిధి వలెనే ఆయన జ్ఞానము మనలను నింపును (దేవసుతుడు) చరణం:-+07 ఆనందముగా యెహోవాకు హల్లెలూయ పాడెదము ఆ … హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ ఆమెన్ (దేవసుతుడు) Share this: Share on X (Opens in new window) X Share on Facebook (Opens in new window) Facebook Like Loading... Related