విన్నారా జనులారా ఈ వార్త శుభవార్త యేసయ్య జన్మించినాడు SONG LYRICS TELUGU CHRISTMAS SONGS

విన్నారా జనులారా  ఈ వార్త శుభవార్త  యేసయ్య జన్మించినాడు  SONG LYRICS

JOIN FOR SONGS IN TELEGRAM

పల్లవి:-

విన్నారా జనులారా 

ఈ వార్త శుభవార్త (2)

యేసయ్య జన్మించినాడు 

రక్షకుడుదయించి నాడు (2)

బేత్లెహేములో పశులపాకలో

కన్యమరియ  గర్భమందున (2)

రారాజు జన్మించినాడు 

మనకై భువికొచ్చినాడు (2)

చరణం:+01

సర్వశక్తిగల యేసుదేవుడు 

సమస్తము చేయగల దేవుడు

పరలోకభాగ్యము వీడి 

దీనునిగా భువికొచ్చినాడు (2)

పాపమెరుగని పావనాత్ముడు

పరిశుద్ధులలో అతి శ్రేష్ఠుడు

(యేసయ్య జన్మించినాడు)

చరణం:-+02

పాపులకై వచ్చిన దేవుడు 

ప్రేమించి కరుణించే దేవుడు

అంధకారమైన జీవితాలకు 

వెలుగుగా ఉదయించినాడు (2)

(మన) పాపదోషము పరిహరింపను

పరిశుద్ధులుగా 

మనల చేయను (2)

(యేసయ్య జన్మించినాడు)

Leave a comment

Design a site like this with WordPress.com
Get started