ఆగిపోదు నా పాట – గమ్యం చేరేదాక సాగుతుంది ప్రతిపూట – నా పరుగు ముగిసేదాక TELUGU CHRISTIAN SONG LYRICS

*🎶ఆగిపోదు నా పాట!🎶*

ఆగిపోదు నా పాట – గమ్యం చేరేదాక (2)

సాగుతుంది ప్రతిపూట – నా పరుగు ముగిసేదాక (2)

1. లోకాశలు లాగినా వెనుదిరిగి చూడను

అలసటతో జోగినా శృతి తగ్గనీయను (2)

ఎదురైన అవరోధం యేసే తొలగించును (2)

స్థిరమైన విశ్వాసం నాలో కలిగించును (2) ||ఆగిపోదు||

2. నా అడుగు జారినా కలవరము చెందను

నా బలము పోయినా లయ తప్పనీయను (2)

ఎదురైన అవరోధం యేసే తొలగించును (2)

స్థిరమైన విశ్వాసం నాలో కలిగించును (2) ||ఆగిపోదు||

3. శత్రువు ఎదురొచ్చిన ధైర్యమును వీడను 

మిత్రులు నను గుచ్చినా శ్రావ్యత పొనీయను (2)

ఎదురైన అవరోధం యేసే తొలగించును (2)

స్థిరమైన విశ్వాసం నాలో కలిగించును (2) ||ఆగిపోదు||

Leave a comment

Design a site like this with WordPress.com
Get started