*🎶గళమెత్తి పాడినా!🎶*
గళమెత్తి పాడినా – స్వరమాలపించినా } 2
నీ గానమే – యేసు నీ కోసమే
నీ ధ్యానమే – యేసూ నీ కోసమే
1. నశియించిపోయే నన్ను బ్రతికించినావే
కృశియించిపోయే నాలో వసియించినావే } 2
నీ కార్యము వివరించెదను – నీ నామము హెచ్చించెదన్
నాకున్న సర్వమా – ఏకైక దైవమా } 2|| గళమెత్తి ||
2. మతిలేక తిరిగే నన్ను సరిచేసినావే
గతిలేని నా బ్రతుకునకు గురి చూపినావే } 2
నీలో అతిశయించెదన్ – నీ ఆనందించెదన్
నాకున్న సర్వమా – ఏకైక దైవమా } 2|| గళమెత్తి ||
3. శ్రమచేత నలిగిన నన్ను కరుణించినావే
కృపచేత ఆపదనుండి విడిపించినావే } 2
నీ నీతిని వర్ణించెదన్ – నీ ప్రేమను ప్రకటించెదన్
నాకున్న సర్వమా – ఏకైక దైవమా } 2|| గళమెత్తి ||