ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట ఆత్మానంద గీతముల్ SONG LYRICS

 పల్లవి:

{ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట ఆత్మానంద గీతముల్ పాడేద} [2]

                               ||ఆనందమే||

చరణం:1

{సిలువలో నాకై రక్తము కార్చెను 

సింహాసనమునకై ననున్ను

పిలిచెను} [2]

{సింహపు కోరలనుండి నను

 విడిపించెను} [2]

                      ||ఆనందమే||

చరణం: 2

{విశ్వాసమును కాపాడుకొనుచు

విజయుడైన యేసుని 

ముఖమును చూచుచు} [2]

{విలువైన కిరీటము పొందెద

 నిశ్చయము} [2] 

                    ||ఆనందమే||

చరణం: 3

{నా మానస వీణను మ్రోగించగా 

నా మనోనేత్రములందు

కనిపించె ప్రభు రూపమే} [2]

{నా మాదిలోన మెదిలేను ప్రభు

 సప్తస్వరాలు} [2]

                    ||ఆనందమే||

Leave a comment

Design a site like this with WordPress.com
Get started