సమాధిని గెలిచిన యేసు EASTER SONG LYRICS 🎵

 🎵. *సమాధిని గెలిచిన యేసు*

లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు-

లేతునని తాన్- చెప్పినట్లు 

లేఖనములో పలికినట్లు..

  *లేచినాడురా – సమాధి గెలిచినాడురా..!*                        

1️⃣

భద్రముగా సమాధి పైన

పెద్ద రాతిని యుంచిరి భటులూ – (2)

ముద్ర వేసి రాత్రి అంతా

నిద్ర లేక కావాలియున్నా…!        

*లేచినాడురా – సమాధి గెలిచినాడురా..!*

2️⃣

ప్రభువు దూత పరము నుండి – 

త్వరగా దిగి రాతిని పొర్లించి – (2)

భళిరే దానిపై కూర్చుండె

భయము నొంద కావలివారు                

*లేచినాడురా – సమాధి గెలిచినాడురా..!*

3️⃣

పాప భారము లేదు మనకు

మరణం భయము లేదు మనకు(2)

నరక బాధ లేదు మనకు(2)

మరువకండి యేసుప్రభుని

*లేచినాడురా – సమాధి గెలిచినాడురా..!*

4️⃣

యేసునందే – రక్షణ భాగ్యం

యేసునందే – నిత్యజీవం(2)

యేసునందే – ఆత్మశాంతి(2)

యేసునందే – మోక్ష భాగ్యం 

*లేచినాడురా – సమాధి గెలిచినాడురా..!*

5️⃣

పాపులకై వచ్చినాడు

పాపులను కరుణించినాడు(2)

పాపులను ప్రేమించినాడు(2)

ప్రాణదానం చేసినాడు   

*లేచినాడురా – సమాధి గెలిచినాడురా..!*

🎤🎷🥁🎶🎸🎻🎺🪕🎤

Leave a comment

Design a site like this with WordPress.com
Get started