నా హృదయాన కొలువైన యేసయ్యా SONG LYRICS / HOSSANA MINISTRIES SONG LYRICS / TELUGU CHRISTAIN SONG LYRICS // Posted bysamuelrajsuraboinaJune 20, 2022Posted inUncategorizedTags:Telugu Christian Song Lyrics నా హృదయాన కొలువైన యేసయ్యా SONG LYRICS పల్లవి: {నా హృదయాన కొలువైన యేసయ్యా నా అణువణువు నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా} [1] {నా హృదయార్పణతోప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజార్హుడా} [2] ||నా హృదయాన||చరణం: 1{అగ్ని ఎడంతలై మండుచుండినను అగ్ని జ్వాలలు తాకాలేదులె నీ ప్రియుల దేహాలను} [2] {అగ్ని బలము చల్లారెనే శత్రు సమూహము అల్లాడెనే} [2]{నేను నీ స్వాస్థ్యమే – నీవు నా సొంతమే నా స్తోత్రబలులన్ని నీకేనయ్యా} [2] ||నా హృదయాన||చరణం: 2{అంతా వ్యర్ధమని వ్యర్థులైరెందరో నా గురి నీపై నిల్పినందుకేనా పరుగు సార్ధకమాయనే} [2] {నీ యందు పడిన ప్రయాసము శాశ్వత కృపగా నాయందు నిలిచెనే} [2] {నీపై విశ్వాసమే నన్ను బలపరచెనే నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును} [2] ||నా హృదయాన||చరణం: 3{విత్తినది ఒకరు నీరు పోసింది వేరొకరు ఎరువు వేసింది ఎవ్వరైనను వృద్ధి చేసింది నీవే కదా} [2] {సంఘ క్షేమాభివృద్ధికే పరిచర్య ధర్మము నియమించినవే} [2]{నీ ఉపదేశమే నన్ను స్థిరపరచెనే నా స్వరము నీకే అర్పింతును} [2] ||నా హృదయాన|| 🙏 Share this: Share on X (Opens in new window) X Share on Facebook (Opens in new window) Facebook Like Loading... Related