నా సంపదల గని SONG LYRICS | TELUGU CHRISTIAN SONG LYRICS | Naa Sampdhala Ganivi neevaya yessaya song lyrics |

 నా సంపదల గని SONG LYRICS 

నా సంపదల గనివి నీవయ్యా నా యేసయ్యా సర్వస్వం నీవేనయ్యా సమాధాన రాజా సంబరాలు        ||2||    చేయుచూ గళమెత్తి పాడుకొందును నిన్నేనా హృదయములో కొలుచుకొందునూ…                ||2||
ఏ దీవెన నోచుకోని ఈ దీన దరిద్రునికై ధనవంతుడైన నీవు దరిద్రునిగ దిగివచ్చి శ్రీమంతుడా సిలువలో  ||2||
మరణించి సిరికంటే మిన్న అయిన కృప కుమ్మరించినావయ్యా..                                    ||2||
ఏ జ్ఞానము లేని ఈ వెర్రివాని ప్రేమించి అనంత జ్ఞాని నీవు బోధకునిగ దిగివచ్చి సత్ బోధకుడా        ||2|| 
సత్యమును నేర్పించి లోక జ్ఞానులెరుగని దైవ జ్ఞానమిచ్చినావయ్యా…                                    ||2||
“ఏ అభిషేకము లేక ఫలియించని నన్ను చూచి  సరిశుద్ధాత్ముడా నీ వర్షముతో నను తడిపి        ||2||
నిజమైన ద్రాక్షవల్లి నీతో నను అంటుకట్టి ఆశించిన అభిషేకము నాకిచ్చిన నా యేసయ్యా…           ||2||

Leave a Reply

Create your own website, free on WordPress.com.Create your own website.
Start free