వాడుకో….. యేసయ్యా…. పొద్దు వాలిపోకముందే.. నన్ను వాడుకో.. యేసయ్యా… నీ కాడి నే మోస్తానయ్యా… Song Lyrics

 కో:

{వాడుకో….. యేసయ్యా….

పొద్దు వాలిపోకముందే..

నన్ను వాడుకో.. యేసయ్యా…

నీ కాడి నే మోస్తానయ్యా…

నీ కాడి నే మోస్తానయ్యా…} [1]

పల్లవి:👨‍🎤👩‍🎤

{వాడిపోకముందే నన్ను వాడుకో

పొద్దు వాలిపోకముందే

నన్ను వాడుకో } [2]

{వాడుకో యేసయ్యా

నీ కాడి నే మోస్తా } [2]

                |వాడిపోక|

చరణం:1️⃣

{నీవిచ్చిన యవ్వన బలము

నిర్వీర్యము కాకముందే

నాకున్న సంపదలన్నీ

రెక్కలొచ్చి పోకముందే } [2]

                   |వాడుకో|

చరణం:2️⃣

{నీవిచ్చిన జీవితానికి

వెలుగులింక పోకముందే

నా బ్రతుకు యాత్రకు

చీకటింక రాకముందే } [2]

               |వాడుకో|

చరణం:3️⃣

{నీవిచ్చిన ప్రాణము

దేహాన్ని వీడకముందే

నా దినముల పరిమాణం

సంపూర్ణం కాకముందే } [2]

                 |వాడుకో|

Leave a comment

Design a site like this with WordPress.com
Get started