Lyrics:
నా యేసునాధ నీవే నా ప్రాణ దాత నీవే
నీ ప్రేమ చాలు నాకు నా దాగుచోటు నీవే యేసయ్య
నా జీవితాంతము నిన్నే స్తుతింతును
నే బ్రతుకుదినములు నిన్నే స్మరింతును
ఏ రీతి పాడనూ – నీ ప్రేమ గీతము ఏనాడు వీడనీ నీ స్నేహ బంధము
నా యేసునాధ నీవే – నా ప్రాణ దాత నీవే
నీ ప్రేమ చాలు నాకు
నా దాగుచోటు నీవే యేసయ్య నా దాగుచోటు నీవే యేసయ్య
1. ప్రభు యేసు దైవమా – చిరకాల స్నేహమా
నీలో నిరీక్షణే – బలమైనదీ ప్రియమార నీ స్వరం వినిపించు ఈ క్షణం నీ సన్నిధానమే – సంతోష గానమై
నీ జీవవాక్యమే – వెలుగైనదీ
నీ నామ ధ్యానమే సీయోను మార్గమై భయపడను నేనిక – నీ ప్రేమ సాక్షిగా
గానమై – రాగమై
అనుదినము నిన్నే ఆరాధింతును
కలకాలం నీలో – ఆనందింతును
2. కొనియాడి పాడనా – మనసార వేడనా
నీ ప్రేమ మాటలే విలువైనవీ
ఎనలేని బాటలో – వెనువెంట తోడుగా
నా యందు నీ కృప – ఘనమైనదీ
నా నీతి సూర్యుడా – నీ ప్రేమ శాశ్వతం నా జీవ యాత్రలో – నీవేగ ఆశ్రయం
నీ పాద సేవయే – నాలోని ఆశగా
ప్రాణమా – జీవమా
అనుదినము నిన్నే – ఆరాధింతును
కలకాలం నీలో – ఆనందింతును
CREDITS:
Lyrics & Producer: Joshua Shaik
Music: Pranam Kamlakhar
Vocals: Mohammed Irfan
Keys: Mithun
Guitars : Keba Jeremiah
Veena Rajesh Vaidhya
Dholak Girish Vishwa
Tabla Sridhar Chari
Dholki: Omkar Ingwalekar
Shehnai Omkar Dhumal, Vijay Belbansi Strings: CHENNAI STRINGS
Chorus: Surmukhi, Feji, Sindhuri, Aishwarya, Hemambiga,
Supraja Sairam, Kavitha Illango
Studios & Sound Engineers:
Emsquare Studios, Mumbai by Bhasker
20 DB studios, Chennai by Avinash
Soundtown Dockk Studios, Chennai by Mithun & Vishnu
Mix & Mastered by A.P.Sekar at Krishan Digi Design
Studios, Chennai
Music Co-Ordinators: Vincent, Narender Video Shoot: Don Valiyavelicham
Video Edit: Priyadarshan PG
Title Design: SatishFX