దేవునికి ఇష్టనుసారముగా జీవించు దేవుని రాజ్యమును సంపాదించుకో ! BLESSIE SHORT MESSAGE



 ᴘʀᴀɪꜱᴇ ᴛʜᴇ ʟᴏʀᴅ

  క్రీస్తు నందు నా ప్రియమైన సహోదరి,సహోదరులకు మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు..!ఈరోజు మనలో చాలా మంది అనుకుంటారు మా పాపాలు క్షమించబడాలి అనుకుంటారు. నేను రక్షించబడ్డాను, దేవుని నమ్ముకున్నాను కాబట్టి నా పాపాలు క్షమించబడ్డాయి అని అనుకుంటూ ఉంటారు అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది.మనుష్యుల అపరాధములను మీరు క్షమించినయెడల, మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును అని మనము ఒకరిని క్షమిస్తేనే దేవుడు మనలను క్షమిస్తాడు. అయితే ఈరోజు చాలా మంది దేవునికి ఇవ్వడంలో ముందు ఉంటారు కానీ తోటి సహోదరుని కూడా క్షమించలేని దౌర్భాగ్యమైన స్థితిని కలిగి ఉన్నారు. ఈరోజు నువ్వు నీ సహోదరునే క్షమించలేకపోతే దేవుడు నిన్ను ఎలా క్షమిస్తాడు అనుకుంటున్నావు.. ఈరోజు నువ్వు ఒకరిని క్షమించకపోతే జాగ్రత్త దేవుని తీర్పులో నిలబడతావ్ అని గుర్తు పెట్టుకొని దేవుని విధేయత కలిగి జీవించు.. కాబట్టి దేవునికి ఇష్టనుసారముగా జీవించు దేవుని రాజ్యమును సంపాదించుకో అట్టి కృప దేవుడు మనందరికి దయచేయును గాక ఆమెన్.


Leave a comment

Design a site like this with WordPress.com
Get started