దేవుని కొరకు జీవిద్దాం..దేవుడు ఇచ్చిన తలాంతులను దేవుని కొరకు ఉపయోగిద్దాం. దేవుని రాజ్యాన్ని సంపాదించుకుందాం SHORT MESSAGE BY BLESSIE CREATIONS


 ᴘʀᴀɪSᴇ ᴛʜᴇ ʟᴏʀᴅ
                               క్రీస్తు నందు నా ప్రియమైన సహోదరి,సహోదరులకు మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు..!దేవుడు ఒక్కొక్కరికి ఒక్కోక్క తలాంతును ఇస్తారు. ఆ ఇచ్చిన తలాంతులను ఉపయోగించి ఇంకా అభివృద్ధి పరుచుకోవాలే కానీ మన దగ్గరే ఉంచుకోకూడదు అలా మన దగ్గరే ఉంచుకుంటే దేవుని రాజ్యానికి బదులు నిత్య నరకాన్ని సంపాదించుకుంటాం.. అదే దేవుడు ఇచ్చిన తలాంతులను దేవుని కొరకు నువ్వు ఉపయోగిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదించి,అభివృద్ధి చేసి, విస్తరింపచేస్తాడు. అలాగే క్రైస్తవులుగా ఉన్న మనము దేవుని ఎదుట నిలబడినప్పుడు ఒక గొప్ప సాక్ష్యం పొందుకోవాలి  అతని యజమానుడు భళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మక ముగా ఉంటివి, నిన్ను అనేకమైనవాటిమీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. మనము కూడా అలాంటి ఒక గొప్ప సాక్ష్యాన్ని పొందుకోవాలి. పొందుకోవాలి అంటే దేవుని కోసం జీవించాలి. దేవుడు ఇచ్చిన తలాంతులను దేవుని కొరకు ఉపయోగించాలి అప్పుడే దేవునితో పాటు దేవుని రాజ్యంలో ఆనందించగలుగుతావ్.. లేకపోతే నరకంలో కాల్చబడతావ్.. జాగ్రత్త. కాబట్టి దేవుని కొరకు జీవిద్దాం..దేవుడు ఇచ్చిన తలాంతులను దేవుని కొరకు ఉపయోగిద్దాం. దేవుని రాజ్యాన్ని సంపాదించుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయును గాక ఆమెన్.


STAY TUNED AND BE LIKE SHARE AND SUBSCRIBE BLESSIE CREATIONS


Leave a comment

Design a site like this with WordPress.com
Get started