శ్రమ వచ్చినప్పుడు మనము కృoగిపోకూడదు కానీ ధైర్యంగా ఉండాలి, దేవుని మీద విశ్వాసంతో ఉండాలి,ఓర్పు కలిగి ఉండాలి SHORT MESSAGE BY BLESSIE CREATIONS

ᴘʀᴀɪSᴇ ᴛʜᴇ ʟᴏʀᴅ

                               క్రీస్తు నందు నా ప్రియమైన సహోదరి,సహోదరులకు మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు..!ఈరోజు మనకు ఏదైనా చిన్న సమస్య రాగానే దేవుని నిందించడం.., నా జీవితం ఇంతే అనుకుంటూ బాధ పడుతూ ఉంటారు కానీ దేవుని వాక్యం చెప్తుంది మన విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పు అని ఎరిగి శోధనలో ప్రవేశించినప్పుడు ఆనందించమని వాక్యం చెప్తుంది. నిజమే మనకు ఏదైనా చిన్న సమస్య రాగానే ఓర్పు కోల్పోతాం.కానీ దేవుని వాక్యం చెప్తుంది శ్రమ దినమందు కృoగిన యెడల చేతగాని వాడవగుదువుగాని నిజమే ప్రియులారా.. శ్రమ వచ్చినప్పుడు మనము కృoగిపోకూడదు కానీ ధైర్యంగా ఉండాలి, దేవుని మీద విశ్వాసంతో ఉండాలి,ఓర్పు కలిగి ఉండాలి. ఎందుకంటే ఈలోకంలో మనకొచ్చే ఈ శ్రమలు,శోధనలు శాశ్వతకాలం ఉండవు కానీ వాటిని మనము జయించగలిగితే నిత్యము ఉండే దేవుని రాజ్యంలో ఉంటాము. కాబట్టి శ్రమలను జయిద్దాం దేవుని రాజ్యాన్ని సంపాదించుకుందాం.అట్టి కృప దేవుడు మనందరికి దయచేయును గాక ఆమెన్.



STAY TUNED WITH BLESSIE CREATIONS


Leave a comment

Design a site like this with WordPress.com
Get started