దేవుని రాజ్యానికి చేరాలి అంటే నీ ఆత్మీయ జీవితంతో పాటు నీ క్రియలు కూడా చాలా ప్రాముఖ్యం.. నీ భక్తి జీవితం ఎంత బాగున్నా క్రియలు లేకపోతే ఆ జీవితం వ్యర్థం SHORT MESSAGE BY BLESSIE CREATIONS


దేవుని రాజ్యానికి చేరాలి అంటే నీ ఆత్మీయ జీవితంతో పాటు నీ క్రియలు కూడా చాలా ప్రాముఖ్యం.. నీ భక్తి జీవితం ఎంత బాగున్నా క్రియలు లేకపోతే ఆ జీవితం వ్యర్థం SHORT MESSAGE BY BLESSIE CREATIONS 


ᴘʀᴀɪSᴇ ᴛʜᴇ ʟᴏʀᴅ

                               క్రీస్తు నందు నా ప్రియమైన సహోదరి,సహోదరులకు మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు..!ఈరోజు మనలో చాలా మంది పరలోకం వెళ్ళాలి అంటే ఏమి చెయ్యాలి అనుకున్నవారు ఉన్నారు.. అలాగే ఎలా జీవించిన సరే ఆఖరి సమయంలో దేవున్ని క్షమాపణ అడిగితే ఆయన క్షమించేస్తాడు. అప్పుడు పరలోకం వెళ్లిపోవచ్చు అనే ఆలోచన కలిగిన వారు కూడా అనేకులు ఉన్నారు అయితే ఈరోజు దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట మీరు మార్పునొంది బిడ్డలవంటి వారైతేనే గాని పరలోకరాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అంటున్నాడు. ఇక్కడ దేవుడు మనకి పిల్లలవంటి వారు అని ఎందుకు అన్నారంటే చిన్నపిల్లకి స్వార్థం, అసూయ, కలహాలు పెట్టుకోవడం, కోపడడం, ఒకరిని ఒకలాగా ఇంకొకరిని ఇంకొకలాగా చూడడం రాదు, అందరితోనూ ప్రేమతో ఉంటారు, అందరిని ఒకేలా చూస్తారు కాబట్టి దేవుడు మీరు చిన్నపిల్లలు వారి మనసు కలిగి ఉండాలి అన్నారు. అయితే ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి..? ఒక్కసారి మనలను మనమే పరీక్షించుకుందాం.. దేవుని రాజ్యానికి చేరాలి అంటే నీ ఆత్మీయ జీవితంతో పాటు నీ క్రియలు కూడా చాలా ప్రాముఖ్యం.. నీ భక్తి జీవితం ఎంత బాగున్నా క్రియలు లేకపోతే ఆ జీవితం వ్యర్థం. కాబట్టి క్రియలు కలిగిన జీవితం జీవిద్దాం.. దేవుని రాజ్యంలో ప్రవేశిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయును గాక ఆమెన్

STAY TUNED WIT BLESSIE CREATIONS SUBSCRIBE THE CHANNEL 


Leave a comment

Design a site like this with WordPress.com
Get started