ఈరోజు ఎవ్వరిలో చూసి ప్రేమ కనబడట్లేదు, ప్రేమ చల్లారిపోతుంది short message by blessie creations

ᴘʀᴀɪsᴇ ᴛʜᴇ ʟᴏʀᴅ

                               క్రీస్తు నందు నా ప్రియమైన సహోదరి,సహోదరులకు మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు..! మనతో దేవుడు అనేకసార్లు మాట్లాడుతూ, గద్దిస్తూ వచ్చినమాట ప్రేమ. అందుకే ఆత్మలలో ప్రధాన ఫలము ప్రేమ, అజ్ఞలలో ప్రధాన ఆజ్ఞ ప్రేమ గురించే చెప్పబడింది. ఎందుకంటె ఈరోజు ఎవ్వరిలో చూసి ప్రేమ కనబడట్లేదు, ప్రేమ చల్లారిపోతుంది అయితే ఈరోజు దేవుడు మనతో చెప్తున్నా మాట మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపనియెడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీయెడల చేయుననెను.మనము మన సహోదరిని ప్రేమించాలి. ప్రేమతో దేనినైనా సాధించగలము.ప్రేమతో పదినిముషాలు దేవుని మాటలు చెప్తే ఒక ఘోరమైన పాపి కూడా మారగలడు.దేవుడు ఈ లోకానికి వచ్చి మనకోసం చేసిన త్యాగము కూడా ప్రేమతోనే చేసాడు. కాబట్టి దేవుడు మనకు చెప్తున్నాడు ప్రేమించమని. ఒకవేళ మనము ప్రేమించకపోతే  వెళ్ళేది నరకానికే అని మాత్రం మర్చిపోవద్దు. కాబట్టి అందరిని ప్రేమిద్దాం దేవునికి ఇష్టులుగా జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయును గాక ఆమెన్.


Leave a comment

Design a site like this with WordPress.com
Get started