ఈరోజు వాక్యం చూసినట్లు అయితే నా కనుదృష్టి దుఃఖము చేత మందమాయెను నా అవయవములన్నియు నీడవలె ఆయెను అని యోబు భక్తుడు అంటున్నాడు SHORT MESSAGE BY BLESSIE CREATIONS

ఈరోజు వాక్యం చూసినట్లు అయితే నా కనుదృష్టి దుఃఖము చేత మందమాయెను నా   అవయవములన్నియు నీడవలె ఆయెను అని యోబు భక్తుడు అంటున్నాడు SHORT MESSAGE BY BLESSIE CREATIONS

ᴘʀᴀɪSᴇ ᴛʜᴇ ʟᴏʀᴅ

                               క్రీస్తు నందు నా ప్రియమైన సహోదరి,సహోదరులకు మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు..!ఈరోజు మనలో అనేకులు ఎంతో దుఃఖముతో,వేదనతో ఉన్నవారు ఉన్నారు. వారి బాధను ఒకరికి చెప్పుకోలేని స్థితిలో ఉన్నవారు అనేకులు ఉన్నారు. అలాగే మనము ఈరోజు వాక్యం చూసినట్లు అయితే నా కనుదృష్టి దుఃఖము చేత మందమాయెను నా   అవయవములన్నియు నీడవలె ఆయెను అని యోబు భక్తుడు అంటున్నాడు. ఎందుకంటే ఆయన కూడా ఎన్నో శ్రమల గుండా, ఎన్నిశోధనల గుండా ప్రయాణం చేసాడు. ఆయన కుటుంబమే ఆయనను విడిచిపెట్టింది,  ఎప్పుడు నీతోనే ఉంటాము అని చెప్పిన స్నేహితులే విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఆయన చుట్టూ ఉన్న పరిస్థితులు అన్ని ఆయనకు విరుద్ధంగా మారిపోయినప్పట్టికి కూడా ఆయనకు దేవుని మీద ఉన్న విశ్వాసం ఏ మాత్రం కూడా తగ్గలేదు. దేవున్ని ఒక్కమాట కూడా అనలేదు కానీ ఆ శ్రమలోనే దేవునికి ఇంకా దగ్గర అయ్యాడు.దేవుని దగ్గరనుంది నూరంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు  ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నవో నాకు తెలీదు కానీ దేవుడు నీకు చెప్తుంది కూడా అదే నీ శ్రమ దినమందు నువ్వు దేవున్ని ఆశ్రయదుర్గముగా చేసుకొనగలిగితే దేవుడు నీకు సహాయం చేస్తారు. కాబట్టి యోబు వంటి విశ్వాసం మనము కలిగి ఉందాం దేవుని కృపను పొందుకుందాం.. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయును గాక ఆమెన్.

STAY TUNED WITH BLESSIE CREATIONS 

Leave a comment

Design a site like this with WordPress.com
Get started