ఈరోజు దేవుని వాక్యం కూడా అదే చెప్తుంది తన్నుతాను కాపాడుకోవాలి అనుకునేవాడు తన ప్రాణాన్ని కోల్పోతాడు… SHORT MESSAGE BY BLESSIE CREATIONS

 ఈరోజు దేవుని వాక్యం కూడా అదే చెప్తుంది తన్నుతాను కాపాడుకోవాలి అనుకునేవాడు తన ప్రాణాన్ని కోల్పోతాడు… SHORT MESSAGE BY BLESSIE CREATIONS 

 ᴘʀᴀɪSᴇ ᴛʜᴇ ʟᴏʀᴅ

                               క్రీస్తు నందు నా ప్రియమైన సహోదరి,సహోదరులకు మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు..!ఈరోజు చాలా మంది వారిని వారు కాపాడుకోవాలి అని, తమ్మును తాము రక్షించుకోవాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఆ ప్రయత్నాలలో లాభముగా మరణాన్ని చూస్తున్నారు. వారి ప్రయత్నాలు సఫలం కావడంలేదు. ఈరోజు దేవుని వాక్యం కూడా అదే చెప్తుంది తన్నుతాను కాపాడుకోవాలి అనుకునేవాడు తన ప్రాణాన్ని కోల్పోతాడు, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని దక్కించుకొనును అని నిజమే ప్రియులారా.. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావ్..?నీ ప్రాణం కోసం నువ్వే ప్రయాసపడుతున్నావా..? లేకపోతే దేవునికోసం జీవిస్తున్నావా..? ఒక్కసారి నిన్ను నీవే పరీక్షించుకో.. నీ కోసం నువ్వు ప్రయాసపడితే ఆ ప్రయాసకు బదులు నరకాన్ని పొందుకుంటావ్.. అదే బ్రతుకుట క్రిస్తే చావైతే నాకు మేలు అని యెంచి దేవునికోసం నువ్వు బ్రతికినట్లు అయితే దేవుని రాజ్యాన్ని పొందుకుంటావ్.. ఏది కావాలి నీకు.., నీ కోసం నువ్వు కస్టపడి నరకాన్ని సంపాదించుకుంటావా..? దేవునికోసం జీవించి దేవుని రాజ్యాన్ని సంపాదించుకుంటావా..? నిర్ణయం నీదే.. కాబట్టి దేవుని కోసం జీవిద్దాం దేవుని రాజ్యాన్ని సంపాదించుకుందాం.. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయును గాక ఆమెన్..


STAY TUNED WITH BLESSIE CREATIONS SUBSCRIBE BLESSIE CREATIONS


Leave a comment

Design a site like this with WordPress.com
Get started