రక్షకుండుదయించి నాడట మన కొరకు బరమ రక్షకుండుదయించి నాడట రక్షకుండుదయించి నాడు రారె – గొల్లబోయలార TELUGU CHRISTMAS SONGS Posted bysamuelrajsuraboinaNovember 13, 2021Posted inUncategorized పల్లవి:-🎵🎶🎸 రక్షకుండుదయించి నాడట మన కొరకు బరమ రక్షకుండుదయించి నాడట రక్షకుండుదయించి నాడు రారె – గొల్లబోయలార (2) తక్షణమున – బోయి మన నిరీక్షణ ఫలమొందెదము (..రక్షకుండు..) చరణం:-+01 దావీదు వంశమందు ధన్యుండు జన్మించినాడు (2) దేవుడగు యెహోవా మన దిక్కు జేరి చూచినాడు (..రక్షకుండు..) చరణం:-+02 గగనమునుండి దిగి ఘనుడు గబ్రియేలు దూత (2) తగినట్టు చెప్పె వారికి మిగుల సంతోషవార్త (..రక్షకుండు..) చరణం:-+03 వర్తమానము జెప్పి దూత వైభవమున బోవుచున్నాడు (2) కర్తను జూచిన వెనుక కాంతుము విశ్రమం బప్పుడు (..రక్షకుండు..) చరణం:-+04 పశువుల తొట్టిలోన భాసిల్లు వస్త్రముల జుట్టి (2) శిశువును గనుగొందురని శీఘ్రముగను దూత తెల్పె (…రక్షకుండు…) అదనపు చరణం:-+05 అనుచు గొల్ల లొకరి కొక రానవాలు జెప్పుకొనుచు (2) అనుమతించి కడకు క్రీస్తు నందరికినీ దెల్పినారు (…రక్షకుండు) Share this: Share on X (Opens in new window) X Share on Facebook (Opens in new window) Facebook Like Loading... Related