అందాల తార అరుదెంచె నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్.. TELUGU CHRISTMAS SONG Posted bysamuelrajsuraboinaNovember 14, 2021Posted inUncategorized పల్లవి:-🎶🎵🎸 అందాల తార అరుదెంచె నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్…(2) ఆనందసంద్ర ముప్పోంగెనాలో అమరకాంతిలో ఆది దేవుని జూడ అశింపమనసు పయనమైతిమి (అందాల తార) చరణం:-+01 యెరూషలేము రాజనగరిలో ఏసును వెదకుచు ఎరిగిన దారి తొలగిన వేల ఎదలో కృంగితి యేసయ్య తీర ఎప్పటివోలె ఎదురాయె త్రోవలో ఎంతో యబ్బురపడుచు విస్మయ మొందుచు ఏగితి స్వామి కడకు (అందాల తార) చరణం:-+02 ప్రభుజన్మస్ధలము పాకయేగాని పరలోక సౌధమే బాలునిజూడ జీవితమెంత పావనమాయెను ప్రభుపాదపూజ దీవెనకాగా ప్రసరించె పుణ్యము బ్రతుకె మందిరమాయె అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్ధన (అందాల తార) అదనపు చరణం:-+03 విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగా దోచెను వింతైన శాంతి వర్షించె నాలొ విజయపధమున విశ్వాలనేలెడి దేవకుమారుని వీక్షించు దీక్షలో విరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ విశ్రాంతి నొసగుచున్ (అందాల తార) Share this: Share on X (Opens in new window) X Share on Facebook (Opens in new window) Facebook Like Loading... Related